Header Banner

వివాహిత మహిళకు వేధింపులు..! టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐపై కేసు నమోదు!

  Sat May 10, 2025 11:27        Others

మహిళను వేధిస్తుండటంతో రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌పై అలిపిరి పోలీసులు ఇవాళ(శనివారం) కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశ్వనాథ్‌ చెప్పినట్లుగా వినకపోతే తన భర్తను చంపేస్తానని ఫోన్‌లో బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. జనవరిలో స్నేహితులతో కలసి తన భర్తపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. వేధింపులతో పాటు ఆర్ఎస్ఐపై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.


స్మగ్లర్ విజయానందరెడ్డి అండదండలతో టాస్క్‌ఫోర్స్‌లో విశ్వనాథ్‌ పొస్టు దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 2022లో తనను ఆర్ఎస్ఐ విశ్వనాథ్ వేధిస్తున్నారని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లుగా తన కుటుంబాన్ని ఆర్ఎస్ఐ వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది. తన మొబైల్‌కు అసభ్యకరమైన వీడియోలను ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌ పంపించారని ఫిర్యాదులో పేర్కొంది. తట్టుకోలేని బాధితురాలి భర్త ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌కి దేహశుద్ది చేశాడు. వివాహిత ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #Harassment #MarriedWoman #TaskForce #PoliceCase #Justice #WomensRights #AndhraPradesh #BreakingNews #LawAndOrder